17 August 2012

గోరింటాకు (Mehendi)

గోరింటాకు సినీమా లోని ఈ పాట మీ కోసం...

గోరింట పూచింది కొమ్మ లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఎంచక్కా పండేనా ఎర్రన్ని చుక్క
చిట్టి పేరంటాలికి శ్రీ రామ రక్ష
కన్నె పేరంటాలికి కలకాలం రక్ష ll గోరింట ll

మామిడి చిగురెరుపు
మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన ll గోరింట ll

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగి వస్తాడు ll గోరింట ll

పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు
కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లు ll గోరింట ll

More on my site teluguvaramandi.net
 

No comments: