మాసములం న్నింటిలో కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది శివ విష్ణువులిద్దరికీ ప్రియమైనది. ఈ మాసము ఈశ్వరుని పూజించిననూ, మహావిష్ణువుని పూజించిననూ వారు సంతుష్టి పొందెదరనందురు. అన్ని వర్ణముల వారు కార్తీక దామోదర పూజను చేసి సహపంక్తి భోజనము - వన భోజనము చేయుదురు. ఈ మాసములోని - వనభోజనములోని సహపంక్తి భోజనము శాస్త్ర సమ్మతము. ఉసిరి చెట్టు నీడన శ్రీ తులసీ ధాత్రీ సమేత దామోదర స్వామిని సేవించువారికి అన్ని పాపములునూ పోయి అనంత పుణ్యములు వచ్చును. కార్తీక మాసమంతయు పవిత్రమే. అన్ని దినములూ పవిత్రములే. కార్తీక మాసమున నదీ స్నానములు దీపారాధన, కార్తీక దామోదర పూజ మున్నగునవి ముప్పదిరోజులూ చేయవలసి యున్నది.
బలి పాడ్యమి, యమవిదియ త్రిలోచన గౌరీ వ్రతము నాగ చతుర్ధి నాగ పంచమి, స్కందషష్టి గోపాష్టమి బోధనైకాదశి క్షీరాబ్ధి ద్వాదశి వైకుంఠ చతుర్ధశి, జ్వాలా తోరణము, మున్నగు పర్వ దినములు కలవు. ఆయా దినములలో ఆయా దేవతలను పూజించినచో, ఆయా దేవతల అనుగ్రహము కలుగును. పరమ ప్విత్రమైన కార్తీక మాసములో వారి పూజ మరింత ప్రశస్తము. ఈ మాసములోని పూజ మరింత ఫలదాయిని కావున అవకాశమును బట్టి యధాశక్తిగ, పూజ లేదా స్తోత్రపాఠము చేసి అభిష్టదేవతానుగ్రహమును మరింతగా కార్తీక దామోదరుని యనుగ్రహముతో బాటు పొందవలయును.
No comments:
Post a Comment