12 June 2012

Puttadibomma Poornamma


Gurajada Apparao garu was one of the honoured social reformers of the telugu people and a well known poet. His poem 'Puttadibomma Puurnamma' was known by many but read by a few.
This poem has been one of the reasons for achieving a social reform of the age, the abolition of Child Marriages. Because of Gurajada Apparao's relentless efforts Andhra Pradesh is now free of Child Marriages but anyone who attempts to do so is punishable under Law.


తెలుగువారందరికీ గర్వకారణమైన గొప్ప సంఘ సంస్కర్త, కవి మన గురజాడ అప్పారావుగారు. గురజాడ అప్పారావుగారు రచించిన కవిత 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మా గురించి అందరూ విన్నరు, కానీ చాలా కొంతమందే చదివి వుంటారు.
ఈ పద్య కావ్యం మన సాంఘిక జీవనంలో గొప్పామార్పుకి కారణమైనది. ఘురజాడ అప్పారావు గారు బాల్య వివాహాలను రద్దు చేయుటకు ఏంతో కృషి చేసారు. వారి ప్రయత్నాల ప్రతిఫలంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో బాల్య వివాహాలను రద్దు చేయటమే కాకుండా అట్టి చర్యలకు పాల్పడిన వారు చట్టపరంగా శిక్షార్‌హులు.

Gurajada Apparao's 'Puttadibomma Purnamma'

గురజాడ అప్పారావు గారి 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మా మీ కోసం.

మేలిమి బంగరుమెలతల్లార!
కలువల కన్నుల కన్నెల్లారా!
తల్లులుగన్నా పిల్లల్లారా!
                           విన్నారమ్మా యీ కథను.

ఆటపాటల పేటికలారా!
కమ్మనిమాటల కొమ్మల్లారా!
అమ్మలగన్నా అమ్మల్లారా!
                           వినరమ్మా మీ రీ కథను.

కొండల నడుమా కో నొకటున్నది
కోనకి నడుమా కొల నొకటుంది
కొలనిగట్టునా కోవెల లోపల
                            వెలసెను బంగారు దుర్గమ్మ

పూజారింటను పెట్టును చిన్నది
పుత్తడి బొమ్మ పూర్ణమ్మా
అన్నలదమ్ముల కనుగై దుర్గకు
                           పూజకు పువ్వులు కోసేది.

ఏ యే వేళల పూసే పువ్వుల
ఆయావేళల నందించి
బంగారు దుర్గను భక్రితో కొలిచెను
                         పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువల నందించి
బంగారు దుర్గను భక్తితో కొలిచెను
                          పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

పళ్లను మీరిన తీపుల నడలును
పువ్వుల మూరిన పోడుములున్
అంగములందున అమరె పూర్ణమకు
                          పౌరుల మించెను నానాటన్.

కాసుకు లోనై తల్లీ దండ్రీ
నెనరూన్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను నొక
                        ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ

ఆమనిరాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమనిరాగా దుర్గ వనములో
                        కిల కిల పలికెను కీరములు.

ముద్దు నగవులు మురిపెంబులు మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియు ముఖ కమలమ్మును
                         కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఆటల పాటల తోటికన్నియలు
మొగుడు తాతయని కేలించ
ఆటల పాటల కలియక పూర్ణమ్మ
                         దుర్గను చేరీ దుఃఖించె.

కొన్నాళ్లకు పతి కొని పోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
చీరల సొమ్ములు చాలగ దెచ్చెను
                         పుత్తడి బొమ్మకు పూర్ణమ్మకు

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకములాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
                         నేర్పులు మెరసి కైచేస్త్రీ

పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ్మ
తల్లీ దండ్రీ దీవించ్రీ
దీవన వింటూ ఫక్కున నవ్వెను
                         పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ
అన్నల దమ్ముల నప్పుడు పలికెను
                         పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

అన్నల్లారా తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండీ!
బంగరుదుర్గను భక్తితొ కొలువం
                         డమ్మల కమ్మా దుర్గమ్మ

ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ
భక్తిని గోసీ శక్తికి నివ్వం
                         డమ్మల కమ్మా దుర్గమ్మ

నలుగురు కూచొని నవ్వే వేళల
నాపేరొకతరి తలవండి
మీ మీ కన్న బిడ్డల నొకతెకు
                         ప్రేమను నా పేరివ్వండి

బల కన్నులు కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమ్మకు
కన్నుల తడుచుక కలకల నవ్వెను
                         పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై యల్లుని తలుచుకు
                         ఆనందించెను అయ్యొకడె.

ఎప్పటి యట్టుల సాయంత్రమ్మున
ఏరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
                          నొంటిగ పోయెను పూర్ణమ్మ

ఆవులు పెయ్యలు మందల జేరెను
పిట్టలు చెట్టుల గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను.
                           ఇంటికి పూర్ణమ్మ రాదాయె

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసవజనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
                         పూర్ణమ్మ ఇంటికి రాదాయె

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేనిపసల్
హంసల జేరెను నడకల బెడుగులు
                         దుర్గను జేరెను పూర్ణమ్మ.

No comments:

Post a Comment