30 November 2010

ఉత్తరాలు వ్రయు విధానం

తెలుగులో ఉత్తరాలు వ్రయుట అనునది ఒక కళ. మనస్సులోని మాట వ్యక్తం చేయుటకు మాతృభాష కన్న మించినది లేదు. కాని తెలుగులో వ్రాయుటమనేది ఇప్పుడు అంతరించిపోయిన కళ. ఆ కళను మనము పునరుద్దరించుదాము.తెలుగులో ఉత్తరాలను వ్రాయుట నేర్చుకొందాము.


లేఖలు రెండు రకాలు
సాంఘిక లేఖలు
వ్యావహారిక లేఖలు

సాంఘిక లేఖలు అనగా భంధుమిత్రులకు వ్రాసేవి, పెండ్లి పండుగలు పుట్టిన రోజు మొదలగు శుభకార్యాలకు పిలుపులు మొదలగు ఉత్తరాలను సాంఘిక లేఖలు అంటారు.
ఇట్టి లేఖలను వ్రాయు నప్పుడు
తల్లిదండ్రులకైతే-పూజ్యులైన నాన్నగారికి,/తండ్రిగారికి/అమ్మగారికి/తల్లిగారికి.. లేదా
ప్రియమైన నాన్నగారికి/తండ్రిగారికి/అమ్మగారికి/తల్లిగారికి,
అదే మిత్రులకైతే-ప్రియ మిత్రుడైన/మితుర్రాలైన శ్రీ.(మిత్రుని పేరు)..కు ...(మీ పేరు)... వ్రాయునది
ప్రాణ స్నేహితునికి/ స్నేహితురాలికి

అదే భంధువులు తెలియనివారికి-అయ్యా/అమ్మా అని ప్రారంభిస్తారు

ఇవేకాకుండా మనకన్నా పెద్దవారిని "మహారాజశ్రీ" అనిగాని, "బ్రహ్మశ్రీ" అని గాని, "శ్రీ వేదమూర్థులు" అనిగాని సంభోదిస్తారు.అదే ఆడవారినైతే "మహాలక్ష్మీ సమానురాలైన " అనిగాని, "శ్రీమతి" అని గాని సంభోధిస్తారు. అదే భర్త చనిపోయిన వారినైతే "గంగాభాగీరధీ సమానురాలైన" అని సంభోధిస్తారు.

మనకన్నా చిన్నవారైతే "చిరంజీవి" అని పేరుకు ముందు చేరుస్తారు.
తరువాత పెద్దవారికైతే "నమస్కారాలు" అనిగాని "వందనాలు" అనిగాని వ్రాయాలి, చిన్నవారికైతే "ఆశీస్సులు" లేదా "దీవెనలతో" అని ప్రారంభించాలి.

ఉదా:- పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు చీన్న నమస్కరించి వ్రాయునది
ప్రియమైన తల్లిగారికి నమస్కారములు
అయ్యా వందనములు
చిరంజీవి చిన్నకు అమ్మ ఆశిస్సులతో వ్రయునది

లేఖ చివరి భాగములో చిన్న వారు పెద్ద వారికైతే "చిత్తగింపవలయును" అనిగాని "ఇట్లు మీ విధేయుడు" అనిగాని వ్రాయవలయునుఅదే పెద్దవారు చిన్న వారికి వ్రాయునప్పుడు "గ్రహింపవలయును" అని వ్రాయుట సహజము.భంధు మిత్రులకు ఎవరికైనా "మీ శ్రేయోభిలాషి" అని సంభోధించ వలయును.


వ్యావహారిక లేఖలనగా వృత్తి, విద్య, వ్యవహార పరంగా వ్రాయు లేఖలు. వ్యావహారిక లేఖలు వ్రాయునప్పుడు "మహాశయా" అనిగాని "అయ్యా" అని సంభోధిస్తారు. లేఖల చివరిభాగములో "విధేయుడు", "భవదీయుడు" అని వ్రాయవలెను.

To write letters in telugu is an art. What better way to express your inner most feelings than expressing them in your mother tongue. But writing in telugu is now a lost art. But we can revive it back to its glory. Let us learn to write letters first.
Letters are of two types
Personal letters
Professional letters

Personal letters include all the letters written to family and friends, invitations for occasions etc. when writing such letters
to parents we start with 'పూజ్యులైన నాన్నగారికి,/తండ్రిగారికి/అమ్మగారికి/తల్లిగారికి.. ' or 'ప్రియమైన నాన్నగారికి/తండ్రిగారికి/అమ్మగారికి/తల్లిగారికి,'
if its for friends then we write 'ప్రియ మిత్రుడైన/మితుర్రాలైన శ్రీ.(friends name)..కు ...(your name)... వ్రాయునదిప్రాణ స్నేహితునికి/ స్నేహితురాలికి'
if it is for people you don't know then for maleఅయ్యా for femalఅమ్మా is the way we start the letters.
While writing to well respected people we use "మహారాజశ్రీ" or "బ్రహ్మశ్రీ" or "శ్రీ వేదమూర్థులు", in case of ladies "మహాలక్ష్మీ సమానురాలైన " or "శ్రీమతి" is used.When reffering to a widow we use "గంగాభాగీరధీ సమానురాలైన" .
When writing to those who are younger than us we write "చిరంజీవి"

Next we say "నమస్కారాలు" or "వందనాలు" and when writing to younger folk we use "ఆశీస్సులు" or "దీవెనలతో".
At the end of the letter we write"చిత్తగింపవలయును" or "ఇట్లు మీ విధేయుడు" for elders, and to those younger than us we write "గ్రహింపవలయును" and to other near and dear ones we write "మీ శ్రేయోభిలాషి"

Professional letters are those written for educational and other official purposses.these letters usually start with "మహాశయా" or "అయ్యా". and at end with "విధేయుడు" or "భవదీయుడు".

No comments:

Post a Comment