11 August 2010

కొన్ని పాటలు మనసుకు హత్తుకు పోతాయి. పాటలకు సంగీతమెంత ముఖ్యమో సాహిత్యం అంతే ముఖ్యము. నేను మెచ్చిన పాటలలో ఒకటి మీ ముందుంచుతున్నను.
సినిమా: మంచి మనుషులు

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీకోసమై
రామయ్య యదలో, రాగాల మాలై పాడాలినే పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీకోసమై

నువ్వక్కడ నే నిక్కడ
పాటిక్కడ పలుకక్కడ
మనిసిక్కడ మనసక్కడ
ఇన్నాళ్ళైనా //2

నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకుంటిని, కలగంటిని, నీవేసిరిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గున్దేలోఅనే
నాలో న తాను నేనేలేను
//జాబిల్లి //

నా వయసొక వాగైనది
నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది
ఆ వెల్లువలో //2

ఈ వాగులలో ఏమవుతానో
ఈ వరదలలో ఎటుపోతానో
ఈ నాడొక ఈ తీరుగ
తెరచాప నువ్వై నడిపించుతావో
తడిచేటి నన్ను దరి చేర్చుతావో
నట్టేట మంచి నవ్వేస్తావో
//జాబిల్లి//

No comments:

Post a Comment