8 August 2011

Sravana Masam

శ్రావణ మాసంలో మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు.వరలక్ష్మీ వ్రతం శ్రావణ పూర్ణిమకి ముందువచ్చే శుక్రవారం జరుపుకుంటారు.అలా వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా జరుపుకోవచ్చు.
శ్రావణ మంగళవారాల్లో చేసే మంగళగౌరీ వ్రతాలను మంగళవారంనోములని కూడా అంటారు.

ఈ వ్రతం చేసే రోజున స్త్రీలు ఉదయమేమంగళస్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, పూజగదిలో కానీ, మరోఅనువైన చోటన కానీమంటపం కట్టి దాని మధ్యన ముగ్గులతో తీర్చిదిద్దికొబ్బరికాయకు లక్ష్మీరూపం అలంకరించి కలశస్థాపన చేసి వరలక్ష్మీవ్రతమైతే లక్ష్మీ దేవినీ, మంగళగౌరీ వ్రతమైతే మంగళగౌరినీ ఆవాహనం చేసి, షోడశోపచారాలతో పూజిస్తారు.

పూజానంతరం పసుపు పూసిన తోరం చేతికి కట్టుకొని, సాయంకాలం ఆరతి ఎత్తి, పేరంటంచేస్తారు. తరువాత వరలక్ష్మీ వ్రత కథా మంగళగౌరీవ్రతకథా చదువుతారు. ఆ కాలంలో దొరికే ఫలాలతో అలంకరించడం,నైవేద్యానికి ఆవిరి కుడుములు వంటి తేలికైన తినుబండారాలను సిద్ధపర్చడం, అన్నింటినీ ఐదైదుగా పెట్టడం ఆచారం.వరలక్ష్మీ కటాక్షం, మంగళగౌరీ కటాక్షం ఏస్త్రీలపై వుంటుందో వారికి వైధవ్య బాధ వుండదు. వారు సర్వసౌభాగ్యాలతో తులతూగుతారు.

No comments: